Bharath Bandh: కొనసాగుతోన్న భారత్ బంద్.. పాఠశాలలు, షాపింగ్ మాల్స్ మూసివేత

by Shiva |
Bharath Bandh: కొనసాగుతోన్న భారత్ బంద్.. పాఠశాలలు, షాపింగ్ మాల్స్ మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దేశ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆగస్టు 1న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీలను ఉప కులాలుగా విభజించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేయడం, దానిని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా భారత్ బంద్‌కు పిలునిచ్చామని మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారత్ బంద్‌‌కు కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, రవాణా, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు బంద్‌కు సంపూర్ణంగా సహకరించాలంటూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed