- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానం
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రదాన కార్యక్రమం ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరుగనుంది. అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తారు. ఈ ఏడాది ఐదుగురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధాని, దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందిన పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని, వ్యవసాయ రంగం పటిష్టం చేసేందుకు కృషి చేసిన జాట్ నేతగా పేరొందిన చౌదరి చరణ్ సింగ్, దేశంలో వ్యవసాయ విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్‌లకు భారత రత్న అవార్డు ప్రకటించింది కేంద్రం.
ఈ నలుగురు ప్రముఖుల సేవలు స్మరిస్తూ.. మరణాంతరం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఈ నలుగురు ప్రముఖుల కుటుంబ సభ్యులకు నేడు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు అందజేయనున్నారు. మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీకి కూడా భారత రత్న ప్రకటించింది కేంద్రం. అయితే, ఈ అవార్డును స్వయంగా రాష్ట్రపతి, ప్రధాని సహా ఇతర ప్రముఖులు అద్వానీ నివాసానికి వెళ్లి రేపు అవార్డును ప్రధానం చేయనున్నారు.