ఇకపై సైన్ బోర్డులన్నీ కన్నడ భాషలోనే

by Harish |
ఇకపై సైన్ బోర్డులన్నీ కన్నడ భాషలోనే
X

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని అన్ని హోటళ్లు, మాల్స్, షాపుల సైన్ బోర్డులు ఇకపై కనీసం 60 శాతం కన్నడ భాషలోనే ఉండాలని నిర్దేశించింది. నగర పరిధి కిందకు వచ్చే షాపులన్నింటికీ త్వరలోనే నోటీసులు పంపుతామని, ఫిబ్రవరి 28 వరకు వారి సైన్ బోర్డులను 60 శాతం కన్నడ భాషలోకి మార్చుకోకపోతే వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని వెల్లడించింది. ఓ సమావేశంలో పాల్గొన్న ‘బెంగళూరు మహానగర పాలక సంస్థ’(బీబీఎంపీ) చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ వెల్లడించారు. కాగా, కర్ణాటక, తమిళనాడులో ‘హిందీ వివాదం’ నడుస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story