Indira Canteens : 11 ఇందిర క్యాంటీన్లు బంద్.. ఎందుకంటే..

by Hajipasha |
Indira Canteens : 11 ఇందిర క్యాంటీన్లు బంద్.. ఎందుకంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : బెంగళూరు నగరంలోని 11 ఇందిర క్యాంటీన్లలో చౌకధరకు భోజన సౌకర్యం నిలిచిపోయింది. ఆ క్యాంటీన్లను నిర్వహించే కాంట్రాక్టరుకు రూ.65 కోట్ల పెండింగ్ బిల్లులను బెంగళూరు నగర పాలక సంస్థ (బీబీఎంపీ) చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి నుంచే సేవలను నిలిపివేశాడు. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు బకాయిలు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ‘‘చెఫ్ టాక్ అనే సంస్థకు ఆ 11 క్యాంటీన్ల నిర్వహణ కాంట్రాక్టును ఇచ్చాం. చౌకధరకు భోజనం చేయడానికి వచ్చిన వారి సంఖ్య విషయంలో ఆ సంస్థ చెబుతున్న లెక్కకు.. అక్కడే కాపలాగా ఉన్న నగరపాలక సంస్థ మార్షల్ నమోదు చేసిన లెక్కలకు చాలా తేడా ఉంది. అందుకే బిల్లులు చెల్లించలేదు’’ అని బెంగళూరు నగర పాలక సంస్థ కమిషనర్ తుషార్ గిరినాథ్ తెలిపారు. బెంగళూరు నగరంలోని మొత్తం 198 వార్డులకుగానూ 184 వార్డుల్లో ఇందిర క్యాంటీన్లు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయని స్పష్టం చేశారు.

Advertisement

Next Story