పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!

by Prasanna |   ( Updated:2023-10-27 08:10:09.0  )
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!
X

కోల్‌కతా: రేషన్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా ఉన్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ఆహార సరఫరా శాఖ మంత్రిగా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే జ్యోతిప్రియ మల్లిక్‌ను అదుపులోకి తీసుకుంది. దాదాపు 20 గంటలపాటు జ్యోతిప్రియ మల్లిక్‌ను ప్రశించిన అనంతరం రేషన్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై శుక్రవారం తెల్లవారుఝామున ఆయనను తన నివాసంలోనే అరెస్ట్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. కోల్‌కతా శివార్లలోని సాల్ట్ లేక్‌లోని అతని ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన ఒక రోజు తర్వాత అరెస్టు చేశారు. ఈ పరిణామం తర్వాత 'ఒక భారీ కుట్రకు బాధితుడి ' ని అయ్యారని జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్ సమయంలో అన్నారు. అరెస్ట్ వ్యవహారంపై స్పందించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఈడీ విచారణలో మంత్రి ఆరోగ్యం క్షీణిస్తే దానికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ పరిణామాలతో మంత్రికి ఏం జరిగినా, బీజేపీ, దర్యాప్తు సంస్థలపై కేసులు పెడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story