- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూండాల లిస్టును లీక్ చేస్తారా ? ఈసీకి గవర్నర్ ఫిర్యాదు
దిశ, నేషనల్ బ్యూరో : గ్యాంగ్‌స్టర్లు, గూండాల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయ అధికారులు రాజకీయ పార్టీలకు లీక్ చేశారని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆరోపించారు. దీనిపై శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. తాను ఎంతో శ్రమకోర్చి ఆ జాబితాను రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించానని.. దాన్ని రాజకీయ పార్టీలకు లీక్ చేసిన ఎన్నికల అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ముప్పున్న వారి వివరాలు లీక్ కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవహారంలో గవర్నర్ పదేపదే జోక్యం చేసుకుంటున్నారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ సర్కారు ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే.. సీవీ ఆనంద బోస్ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం.