Beef: అసోంలో బీఫ్‌పై నిషేధం.. సీఎం బిస్వశర్మ కీలక నిర్ణయం

by vinod kumar |
Beef: అసోంలో బీఫ్‌పై నిషేధం.. సీఎం బిస్వశర్మ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీఫ్ (Beef) తినడంపై పూర్తిగా నిషేదం విధించింది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ డిసిషన్ తీసుకున్నట్టు సీఎం హిమంత బిస్వశర్మ (Himanth biswa sharma) ప్రకటించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో గో మాంసం తినడాన్ని పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు. దేవాలయాల దగ్గర గోమాంసం తినడం నిషేధించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అయితే ప్రస్తుతం దానిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పబ్లిక్ ఫంక్షన్లకు కూడా ఈ నియమం వర్తిస్తుందని చెప్పారు. గో మాంసం వినియోగంపై ప్రస్తుత చట్టం బలంగా ఉందని, అయితే దాని ప్రకారం రెస్టారెంట్లు, హోటళ్లు, మతపరమైన సమావేశాల్లో తినడంపై నిషేధం లేదని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించి కొత్త నిబంధనలను చేర్చుతామని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంపై అసోం మంత్రి పీయూష్ హజారికా (Peeyush Hazarika) స్పందిస్తూ.. బీఫ్ నిషేధాన్ని కాంగ్రెస్ (congress) స్వాగతించాలని లేదంటే పాకిస్థాన్‌(Pakisthan)కు వెళ్లి స్థిరపడాలని సవాల్ విసిరారు. మరోవైపు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఎమ్మెల్యే డాక్టర్ హఫీజ్ రఫీకుల్ ఇస్లాం అసోం ప్రభుత్వ నిర్ణయంపై స్పందించారు. ప్రజలు ఏం తినాలో, ఏం తినడకూడదో కేబినెట్ నిర్ణయించకూడదని తెలిపారు. గోవాలో బీజేపీ బీఫ్ బ్యాన్ చేయలేని, ఈశాన్య రాష్ట్రాల్లోనూ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కానీ అసోంలో మాత్రం ఎందుకు బ్యాన్ చేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

Next Story