BCI: ఢిల్లీలో 107 మంది 'నకిలీ' లాయర్లను తొలగించిన బార్ కౌన్సిల్

by S Gopi |
BCI: ఢిల్లీలో 107 మంది నకిలీ లాయర్లను తొలగించిన బార్ కౌన్సిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఢిల్లీలో 2019 నుంచి 2024, అక్టోబర్ మధ్య 107 మంది నకిలీ లాయర్ల తొలగించింది. న్యాయవ్యవస్థలో సమగ్రత, వృత్తి నిబద్ధతను కొనసాగించడానికి జరుగుతున్న డ్రైవ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 'ఈ చర్యతో నకిలీ లాయర్లను, చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేని వారిని తొలగించడం వీలవుతుంది. అలా చేయడం ద్వారా, బీసీఐ ప్రజల విశ్వాసాన్ని, న్యాయ వ్యవస్థను అనైతిక పద్ధతుల నుంచి రక్షించడానికి సాధ్యమవుతుందని' బీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. న్యాయవాద సంఘం సమగ్రత, వృత్తి నిబద్ధతను కాపాడుకోవడంలో భాగంగా నకిలీ న్యాయవాదుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు. 2019- 2023, జూన్ 23 మధ్య కూడా వేల మంది నకిలీ న్యాయవాదులు వారి ఆధారాలు, ప్రాక్టీస్‌లపై సమగ్ర విచారణ తర్వాత తొలగించబడ్డారు. ఈ తొలగింపులు ఎక్కువగా నకిలీ సర్టిఫికేట్‌ల సమస్యలు, ఎన్‌రోల్ సమయంలో తప్పుగా సూచించడం వల్ల జరిగాయి. అంతేకాకుండా, సరైన ప్రాక్టీస్ చేయకపోవడం, బార్ కౌన్సిల్ వెరిఫికేషన్ ప్రక్రియను పాటించకపోవడం వంటి కారణాలతో తొలగించినట్టు బీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed