Bangladesh: షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు

by S Gopi |
Bangladesh: షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ ప్రభుత్వంపై విద్యార్థులు నిర్వహించిన సామూహిక అల్లర్లలో జరిగిన మరణాలకు బాధ్యురాలిని చేస్తూ ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌కి కొత్తగా నిమమితులైన చీఫ్ ప్రాసిక్యూటర్ అన్నారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన.. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను భారత్‌ నుంచి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే, షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేతలు భారత్‌కు అల్టిమేటం విధించడం గమనార్హం. ముఖ్యంగా ఆ దేశంలోని బీఎన్పీ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ నేతలు హసీనాను అప్పగించాలని కోరాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఆగష్టు 5న తీవ్రస్థాయికి చేరుకున్న తరువాత, హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చారు. సామూహిక హత్యలాతో పాటు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరానికి సంబంధించి షేక్ హసీనా, మరైకొంతమంది నిందితులపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. కొత్త కేసుల విచారణ విషయంలో ప్రస్తుత అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చట్ట సవరణ ఉన్నందున ప్రభుత్వంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు చీఫ్ ప్రాసిక్యూటర్ తెలిపారు. కాగా, ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో జరిగిన నిరసనల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

Advertisement

Next Story