Bangladesh: షేక్ హసీనా కోసం ఇండియాకు బంగ్లా రిక్వెస్ట్!

by Mahesh Kanagandla |
Bangladesh: షేక్ హసీనా కోసం ఇండియాకు బంగ్లా రిక్వెస్ట్!
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌(Bangladesh)లో తీవ్ర ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) ఆగస్టు 5న దేశం విడిచిపెట్టారు. భారత్‌(India)లో అడుగుపెట్టి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ముహమ్మద్ యూనస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం(Interim Government) ఉన్నది.షేక్ హసీనా మానవాళికి తలపెట్టిన హాని, నేరాలను విచారించాలని, అందుకు ఆమెను స్వదేశానికి రప్పించాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెను స్వదేశానికి రప్పించడానికి ఇంటర్‌పోల్ సహకారం తీసుకోనుంది. ఇంటర్‌పోల్ నుంచి రెడ్ నోటీసు జారీ చేయాలని అనుకుంటున్నది. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీసును త్వరలోనే జారీ చేయిస్తామని, పరారీలో ఉన్న ఆ ఫాసిస్టు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా పట్టుకుని తీరుతామని, కోర్టులో విచారణకు హాజరుపరుస్తామని లా అఫెయిర్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ వివరించారు. రెడ్ నోటీసు అంతర్జాతీయ అరెస్టు వారెంట్ కాదని, కానీ, ఆయా దేశాల్లోని దర్యాప్తు సంస్థలకు చేసే అంతర్జాతీయ విజ్ఞప్తి అని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. ఆందోళనల కాలంలో హసీనా నిర్ణయాల వల్ల కనీసం 753 మంది నిరసనకారులు మరణించారని, వేలాది మంది గాయపడ్డారని వివరించారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అండ్ ప్రాసిక్యూషన్ టీమ్‌కు మానవ హననం, మానవాళిపై నేరం వంటి ఆరోపణలతో హసీనాపై కనీసం 60 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.

Advertisement

Next Story