- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bangladesh: దోచుకున్న ఆయుధ సామాగ్రి తిరిగి ఇవ్వాలని బంగ్లాదేశ్ పోలీసుల ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆందోళనలు తీవ్రస్థాయిలో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నిరసనకారులు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో పోలీసులు లేని సమయాల్లో చాలామంది ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లపై దాడికి పాల్పడి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకెళ్లారు. తాజాగా పరిస్థితులు అదుపులోకి రావడంతో పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఆందోళనల సమయంలో లూటీ చేసిన ఆయుధాలను సెప్టెంబర్ 3వ తేదీ నాటికి తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దోచుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని మంగళవారం నాటికి తిరిగి ఇవ్వాలని పోలీసు ప్రధాన కార్యాలయం తన ఆదేశాల్లో పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం, గతవారం నాటికి ఆందోళనకారుల నుంచి మొత్తం 3,872 ఆయుధాలను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అవి కాకుండా 2.86 లక్షల బుల్లెట్లు, 2 వేలకు పైగా గ్రనేడ్‌లు, 22 వేలకు పైన టియర్‌గ్యాస్ షెల్స్ ఉన్నాయి. ఇక, ఇటీవల ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనా నేతృత్వంలోని 15 ఏళ్ల పాలనలో పౌరులకు జారీ చేసిన ఆయుధ లైసెన్సులను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3 నాటికి ఆయుధాలను వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఆయుధాల స్వాధీనానికి తనిఖీలు చేపట్టనున్నట్టు పేర్కొంది.