Bangladesh : దీదీ కామెంట్స్.. బంగ్లాదేశ్ రియాక్షన్.. భారత విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
Bangladesh : దీదీ కామెంట్స్.. బంగ్లాదేశ్ రియాక్షన్.. భారత విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి నుంచి ఎవరైనా బాధితులు వస్తే తప్పకుండా రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తాం’’ అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీదీ కామెంట్స్‌పై నిరసన తెలుపుతూ బంగ్లాదేశ్ తమకు ప్రత్యేక నోట్‌ను పంపిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. విదేశీ వ్యవహారాలపై స్పందించే విశేష అధికారం రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.. ఇలాంటి అంశాలపై రాష్ట్రాల సీఎంలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Advertisement

Next Story