Revolution Museum : ‘విప్లవ మ్యూజియం’గా మారనున్న షేక్ హసీనా నివాసం

by Hajipasha |
Revolution Museum : ‘విప్లవ మ్యూజియం’గా మారనున్న షేక్ హసీనా నివాసం
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina)కు చెందిన విలాసవంతమైన అధికారిక నివాస భవనాన్ని ‘విప్లవ మ్యూజియం’(Revolution Museum)గా మార్చనున్నారు. ఈవిషయాన్ని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్ ప్రకటించారు. ఢాకాలోని షేక్ హసీనా అధికారిక నివాస భవనం ఇకపై బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ జ్ఞాపకాలకు నెలవుగా మారుతుందని వెల్లడించారు.ఆ ఉద్యమమే అరాచక పాలనను అంతం చేసి, హసీనాను దేశం నుంచి తరిమికొట్టిందనే విషయాన్ని మహ్మద్ యూనుస్ గుర్తు చేశారు.

‘‘షేక్ హసీనా హయాంలో విపక్ష నేతలను బంధించేందుకు ఆయ్నా ఘర్ డిటెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అచ్చం అదే తరహా ఒక గదిని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తాం. హసీనా నివాసాన్ని మ్యూజియంగా మార్చే పనులు డిసెంబరుకల్లా ప్రారంభం అవుతాయి’’ అని ఆయన వెల్లడించారు. కాగా, విద్యార్థి ఉద్యమం ఎంతకూ ఆగకపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీకి ఆగస్టు 5న వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed