పాఠశాలల దగ్గర కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం

by Harish |
పాఠశాలల దగ్గర కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్‌ల విక్రయాలపై నిషేధం విధించినట్లు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మంత్రి ధర్మారావు బాబా అత్రమ్ శుక్రవారం రాష్ట్ర శాసనమండలికి తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తమ శాఖ జారీ చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఎగువ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్వతంత్ర శాసనసభ్యుడు సత్యజీత్ తాంబే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ విధమైన ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఒక లీటరు కార్బోనేటేడ్‌లో 145 ml, 300 ml మధ్య కెఫిన్ కంటెంట్ అనుమతించబడుతుంది. అయితే కొన్నింటిలో మోతాదుకు మించి వాడుతున్నారు. పాఠశాలకు దగ్గరగా ఉండే షాపుల్లో వీటిని విక్రయించడం వలన విద్యార్థులు ఎక్కువగా తాగుతుండటంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో అధిక కెఫిన్ ఎనర్జీ డ్రింక్స్‌కు విద్యార్థులకు పరిమిత స్థాయిలోనే అందించేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కౌన్సిల్ డిప్యూటీ చైర్‌పర్సన్ నీలం గోర్హే నిషేధించాల్సిన పానీయాల జాబితాను రూపొందించాలని మంత్రి అత్రమ్‌కు సూచించారు. ఈ ఆర్డర్‌ను సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న FDA అధికారులతో దీన్ని సర్క్యులేట్ చేయాలని కూడా సూచించారు.

Advertisement

Next Story

Most Viewed