Baba Siddique's Son: షూటర్ల హిట్ లిస్టులో జీషాన్ సిద్ధిఖీ..!

by Shamantha N |
Baba Siddiques Son: షూటర్ల హిట్ లిస్టులో జీషాన్ సిద్ధిఖీ..!
X

దిశ నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ(Baba Siddiqui) సంచలనం రేపింది. కాగా.. బాబా సిద్ధిఖీ షూటర్ల హిట్ లిస్టులో ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీ, జీషాన్‌లను హతమార్చేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తమకు కాంట్రాక్ట్‌ ఇచ్చామని నిందితులు చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం జీషాన్ కార్యాలయంలో తండ్రీకుమారులిద్దరూ ఉంటారని సమాచారం అందినట్లు నిందితులు తెలిపరు. కాగా.. వారిద్దరిపై దాడి చేసే అవకాశం లభించకపోతే.. షూటర్లు ముందుగా ఎవర్ని టార్గెట్ గా కనుక్కొంటే వారిని చంపాలని నిందితులకు ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి.

క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ జీషాన్

కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా జీషాన్ సిద్ధిఖ్‌ ఎన్నికగా శాసన మండలి ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు. దీంతో నెలక్రితమే జీషాన్ ను పార్టీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం బహిష్కరించింది. బాబా సిద్ధిఖీని అతడి కుమారుడి కార్యాలయం బయట ముగ్గురు షూటర్లు కాల్చి చంపారు. కాగా.. నిందితుల్లో హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. మూడో వ్యక్తి శివకుమార్ గౌతమ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య వెనుక ఉన్న స్టర్ మైండ్ మహ్మద్ జీషాన్ అక్తర్ (21) అని పోలీసులు గుర్తించారు. అతడి ఆచూకీ కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు, ఈ హత్యకు బాధ్యుల తామేనని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed