టీవీ సీరియల్స్‌పై బాబా రామ్ దేవ్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
టీవీ సీరియల్స్‌పై బాబా రామ్ దేవ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్నోగ్రఫీ, సినిమాలు, సీరియల్స్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సినిమాలు, సీరియల్స్‌లో పోర్న్ కంటెంట్ విచ్చలవిడిగా ఉంటోందని, ఇలాంటి అసభ్యతతో దేశంలోని దేశంలోని యువత తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని అన్నారు. సమాజంలో అసభ్యత విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నారని వాటితో పాటు సినిమాలు, సీరియల్స్ తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు.

యువతి అలాంటి కంటెంట్ తో మోసపోకూడదని సూచించారు. ఆధ్యాత్మిక విద్య ద్వారా ఇలాంటి వాటి నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫిబ్రవరి 20 నుంచి గోవాలోని బాంబోలిమ్‌లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన మూడు రోజుల యోగా శిబిరం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story