- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణప్రతిష్ట సందర్భంగా 'సియారామ్ కలెక్షన్ ' తెచ్చిన సెన్కో గోల్డ్
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట ఉత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జరగనున్న మహా దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త 'సియారామ్ కలెక్షన్' ను ఆదివారం తీసుకొచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతులకు చెందిన భక్తి భావాన్ని పెంపొందించే ఆభరణాలను తయారు చేసినట్టు సంస్థ తెలిపింది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సామరస్యానికి చిహ్నంగా ఇది ఉపయోగపడుతుందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ డిజైన్స్ హెడ్ జొయితా సేన్ అన్నారు. 'రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల మధ్య ప్రేమ, శాంతి, పరిపూర్ణతకు మా 'సియారామ్ కలెక్షన్' ఒక పరిపూర్ణ నివాళి. ఇది కళాత్మకతను వెదజల్లుతుంది. మా కస్టమర్లకు ఈ ప్రత్యేక కలెక్షన్ అందించడం సంతోషంగా ఉందని' సేన్ పేర్కొన్నారు. ఈ కలెక్షన్లో రామాయణాన్ని సూచించే లాకెట్లు, నెక్లెస్, చెవిపోగులు ఉన్నాయి. అత్యంత ప్రసిద్ధ, గొప్ప దేవాలయాల్లో ఒకటైన అయోధ్య రామమందిరానికి సంబంధించి క్లిష్టమైన డిజైన్లను తీసుకొచ్చామని సంస్థ వెల్లడించింది.