- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందూ దేవాలయాలపై దాడులు సహించేది లేదు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సహించేది లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని ఆల్బనీస్ తో ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, వేర్పాటువాద శక్తులపై ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో మాట్లాడానని ఈ అంశంపై గతంలోనూ మా మధ్య ప్రస్తావన రాగా.. ఈ రోజు మరోసారి సమాలోచనలు చేశామన్నారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీయడాన్ని సహించ కూడదని చెప్పారు. దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న ఆస్ట్రేలియా ప్రధానికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని హామీ ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ ను చూసేందుకు రావాలని ఈ సందర్భంగా ఆసీస్ ప్రధానిని మోడీ ఆహ్వానించారు. కాగా ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం, శ్రీ శివ విష్ణు దేవాలయం, స్వామినారాయణ మందిర్ లపై హిందూ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు దాడులు చేశారు