బెంగాల్‌లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. వారం రోజుల పాటు సెలవులు

by Mahesh |
బెంగాల్‌లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. వారం రోజుల పాటు సెలవులు
X

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకన చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు దృష్టిలో పెట్టుకుని వారం రోజుల పాటు అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. వడగాలులు ప్రభావం తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘వడగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి శనివారం వరకు అన్ని విద్యాసంస్థలు మూసి ఉంటాయి’ అని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలు కూడా దీనిని అనుసరించాలని బెనర్జీ కోరారు.

అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు అనవసరంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయట తిరగవద్దని ఆదేశించారు. కాగా బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే మే 2 నుంచి మూడు వారాల పాటు కొండ ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు స్థానిక వాతావరణ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed