ల్యాండ్స్ సేల్‌కు మతాలతో లింక్.. అమల్లోకి వివాదాస్పద ఉత్తర్వు

by Hajipasha |   ( Updated:2024-03-23 12:23:14.0  )
ల్యాండ్స్ సేల్‌కు మతాలతో లింక్.. అమల్లోకి వివాదాస్పద ఉత్తర్వు
X

దిశ, నేషనల్ బ్యూరో : అసోంలోని బీజేపీ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య భూముల విక్రయాలకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జారీని తాత్కాలికంగా ఆపేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో మతపరమైన వివాదాలను నివారించే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలుపుతూ అసోం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై మార్చి 7న అసోం రెవెన్యూ, విపత్తు నిర్వహణ (రిజిస్ట్రేషన్) శాఖ జారీ చేసిన ఉత్తర్వు మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే భూముల విక్రయాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగదని జిల్లా కమీషనర్ భావించిన దరఖాస్తుదారుల వ్యవహారంలో ఎన్ఓసీ మంజూరుకు అవకాశం ఉంటుందని తెలిపాయి. అసోం లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో మూడు దశల్లో జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed