- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అశోక్ గెహ్లాట్ కుమారుడికి ఓటమి తప్పదు- అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడిపై కేంద్రహోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని బిల్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. రాజస్థాన్ లోని 25 స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నిస్థానాలను నరేంద్రమోడీకే కట్టబెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైభవ్ గెహ్లాట్ ఓడిపోతారని పేర్కొన్నారు.
తొలిదశలో ఇప్పటికే రాజస్థాన్ లోని 12 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. పోలింగ్ పూర్తయిన 12 స్థానాలు కూడా మోదీకి దక్కనున్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ మొత్తం 25 సీట్లను నరేంద్ర మోడీకి మూడోసారి ఇచ్చేయడంతో.. హ్యాట్రిక్ విజయాన్ని గెలుపొందబోతున్నామని అమిత్ షా ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతి మూడు నెలలకోసారి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారని మండిపడ్డారు.
లోక్‌సభ ఎన్నికలు తొలిదశ పోలింగ్ ముగిసింది. శుక్రవారం 21 రాష్ట్రాలోని మొత్తం 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది. మొదటి దశలో 12 సీట్లకు ఎన్నికలు ముగియగా.. రెండో దశలో మరో 13 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.