యూపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు.. అసనుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన

by Disha News Web Desk |
యూపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు.. అసనుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన
X

లక్నో: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసనుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీకి బాబు సింగ్ కుశ్వాహ, భారత్ ముక్తీ మోర్చాలతో పొత్తు పెట్టుకున్నట్లు శనివారం ప్రకటించారు. 'ఒక వేళ మా కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని అన్నారు. వీరిలో ఒకరు ఓబీసీ, మరొకరు దళిత వర్గం నుంచి తీసుకుంటామని తెలిపారు. దీంతో పాటు ముస్లిం అభ్యర్థితో సహా ముగ్గురు డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ఉంటారని మీడియా సమావేశంలో తెలిపారు. 100 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కూటమి ఏర్పడటానికి ఎటువంటి బలవంతం లేదని బాబు సింగ్ కుశ్వాహ అన్నారు. దళితుల కోసం, వెనుకబడిన తరగతులు, మైనార్టీల కోసం చాలా కాలంగా పనిచేస్తున్నామని నొక్కి చెప్పారు. వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ 403 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed