- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడికిపోతున్న దక్షిణాసియా..
న్యూఢిల్లీ: దక్షిణ, ఆగ్నేయాసియాలోని దేశాలు ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అట్టుడికిపోయాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సీయస్ కంటే అధికంగా నమోదైంది. బంగ్లాదేశ్‌లో ఉష్ణోగ్రత 50 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. థాయ్‌లాండ్‌లో రికార్డు స్థాయిలో 45, లావోస్‌లో 42 డిగ్రీల సెల్సీయస్ నమోదైంది. మానవ తప్పిదాల వల్ల ఇటువంటి వేడి తరంగాలు 30 రెట్లు ఎక్కువయ్యాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం మంగళవారం తెలిపింది. భారతదేశంలోని చాలా నగరాలు ప్రస్తుత స్థాయి కంటే 7-8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతను ఎదుర్కొంటాయని కూడా వారు చెప్పారు.
వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ విడుదల చేసిన రాపిడ్ అట్రిబ్యూషన్ అనాలిసిస్ నివేదికలో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి. నివేదికను రూపొందించిన బృందం ఆగ్నేయాసియా దేశాలలో వేడి, తేమ స్థాయిలను అధ్యయనం చేసింది. అంతర్లీన వాతావరణ మార్పుల ఫలితంగా రెండు డిగ్రీల సెల్సీయస్ వేడి పెరిగిందని నిర్ధారించింది. అంటే.. 1900 నుంచి సగటున ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సీయస్ పెరుగుదలను ఇది సూచిస్తోంది. ఈ పోకడలు ఇలాగే కొనసాగుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రతి రెండేళ్లకోసారి ఇటువంటి వేడి వాతారణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
Read more:
చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు