కేజ్రీవాల్‌కు నో పర్మిషన్.. డాక్టర్‌తో వీసీకి అనుమతి ఇవ్వలేమన్న కోర్టు

by Hajipasha |
కేజ్రీవాల్‌కు నో పర్మిషన్.. డాక్టర్‌తో వీసీకి అనుమతి ఇవ్వలేమన్న కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురైంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతున్నందున రోజూ 15 నిమిషాలు తన డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్సు(వీసీ)లో సంప్రదించే అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అయితే కేజ్రీవాల్‌కు రోజూ ఇన్సులిన్ ఇవ్వడం అవసరమా ? వద్దా ? అనేది తేల్చడానికి వైద్య నిపుణుల టీమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. డయాబెటాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టుల ద్వారా కేజ్రీవాల్‌కు ప్రత్యేక చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని తిహార్ జైలు అధికారులకు న్యాయస్థానం నిర్దేశించింది. నెల రోజులుగా తనకు జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడం లేదంటూ గత వారమే కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు. తన వ్యక్తిగత వైద్యుడిని రోజూ సంప్రదించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే బెయిల్ పొందాలనే దురుద్దేశంతోనే కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లను అతిగా తినేసి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని అప్పట్లో కోర్టుకు ఈడీ తెలిపింది. ఇన్సులిన్ తీసుకోవడం కొన్ని నెలల క్రితమే మానేశానని కేజ్రీవాల్ చెప్పినందు వల్లే తాము ఆయనకు ఇన్సులిన్‌ను అందించడం లేదని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed