Arvind Kejriwal: కేంద్రంతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధం.. కానీ బీజేపీ దాన్ని ఒప్పుకోవాలి

by Javid Pasha |   ( Updated:2022-08-16 17:18:35.0  )
Arvind Kejriwal Says, We are Ready to Work with Centre to Improve Healthcare, Education
X

దిశ, వెబ్‌డెస్క్: Arvind Kejriwal Says, We are Ready to Work with Centre to Improve Healthcare, Education| తమ ప్రభుత్వ విధానాలను అవలభించి దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలబెట్టాలని కేంద్రాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ విద్యా, వైద్య ఫెసిలిటీల్లో తమ ప్రభుత్వం ఆచరిస్తున్న పద్దతులను దేశమంతా అమలు చేయాలని, తద్వారా దేశం అభివృద్ధి చెందడం ఎంతో వేగవంతం అవుతుందని కేజ్రీవాల్ అన్నారు. అంతేకాకుండా కేంద్రాన్ని కేజ్రీవాల్ మరో కోరిక కోరారు. 'దేశంలో విద్య, వైద్యాన్ని మెరుగు పరిచేందుకు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.కానీ ఉచిత విద్య, వైద్యాన్ని ఉచితాలు కాదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి' అని కేజ్రీవాల్ అన్నారు.

అయితే కేజ్రీవాల్, కేంద్ర బీజేపీల మధ్య గత కొంతకాలంగా ఈ ఉచితాల వివాదం జరుగుతోంది. ఇది రోజురోజుకు మరింత ముదురుతోంది. ప్రభుత్వాలు ఉచితాలను ఓట్ల కోసమే ఇస్తున్నాయని, అసలు ఉచితాలు ఇస్తే రోడ్లు, విమానాశ్రయాలు అభివృద్ధి ఎలా చేస్తారని బీజేపీ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరి హక్కని వాటిని ఉచితాలుగా పరిగణించకూడదని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీల మధ్య మినీ వార్ సాగుతోంది.

ఇది కూడా చదవండి: 31 మందితో బీహార్ క్యాబినెట్‌ ప్రమాణస్వీకారం

Advertisement

Next Story