- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫలితాలపై సానుకూలంగానే ఉన్నాం: Delhi CM
న్యూఢిల్లీ: గుజరాత్, హిమచల్‌ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఫలితాలపై తాము సానుకూలంగా ఉన్నామని కేజ్రీవాల్ అన్నారు. మంగళవారం విధాన సభలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి పోటీ చేస్తున్న పార్టీకి కనీసం 10-20 శాతం ఓట్ల వాటా రావడమే గొప్పదని అన్నారు. అయితే తుది ఫలితాల కోసం ఎదురుచూడాలని చెప్పారు. కాగా, సోమవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో గుజరాత్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్ ఫలితాలు నిరాశే ఇవ్వడమే కాకుండా ఆప్ 20లోపు సీట్లు సాధిస్తుందని పేర్కొన్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ ఆప్ ఖాతా తెరిచే అవకాశం లేదని, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తగ్గ పోరు ఉంటుందని వెల్లడించాయి. అయితే ఆప్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.