- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly Elections: ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2నే కౌంటింగ్.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
దిశ, వెబ్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని జూన్ 4గా సీఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తేదీలో స్వల్ప మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 4కు బదులుగా రెండు రోజులు ముందుగా అంటే 2వ తేదీనే కౌంటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తేదీలు ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న ఓటింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల కౌంటింగ్ ప్రక్రియను తొలుత ప్రకటించిన తేదీ కంటే రెండు ముందే నిర్వహిస్తున్నట్లు అధికారులు తాజాగా స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 స్థానాలకు, సిక్కింలో 32 స్థానాలకు మొదటి దశలోనే ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.