Arrest: బెంగళూరు టెకీ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం.. ఆ ముగ్గురు అరెస్ట్

by Shiva |
Arrest: బెంగళూరు టెకీ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం.. ఆ ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ (Atul Subhash) ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అతడి బలబన్మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింఘానియా (Nikhitha Singhania), అత్త నిషా (Nisha), బావమరిది అనురాగ్‌ (Anurag)‌ను తాజాగా బెంగళూరు పోలీసులు (Bengaluru Police) అరెస్టు చేశారు. అయితే, నిఖితాను హర్యానా (Haryana)లోని గురుగ్రామ్‌ (Gurugram)లో అదుపులోకి తీసుకోగా.. అత్త, బావమరిదిని ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అలహాబాద్‌ (Allahabad)లో అరెస్ట్ చేసి ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్‌ (Judicial Remand)కు పంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.

కాగా, భార్య వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ (Atul Subhash) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో (Selfie Video), 24 పేజీల సూసైడ్ నోట్ (Suicide Note) అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే, అతుల్ రాసిన లేఖలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లుగా తెలిపాడు. తాను విడాకులు కోరగా.. తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించాడు. అదేవిధంగా ఆమెపై హత్యాయత్నం చేశానని, ఇష్టం లేకుండా సెక్స్ (Sex) చేసేందుకు ప్రయత్నించానంటూ ఆరోపించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కోర్టులో నెలకు రూ.2 లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ భార్య నిఖితా నోటీసులు పంపిందని అతుల్ కన్నీటిపర్యంతమై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు (Bengaluru Police) తాజాగా, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అతుల్ ఆత్మహత్యపై సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్)‌లో కూడా ‘మెన్ టూ’ ఉద్యమం ట్రెండింగ్‌లో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed