పాక్‌కు గూఢచర్యం చేసిన సైనికుడు... పట్టుకున్న ఆర్మీ

by S Gopi |
పాక్‌కు గూఢచర్యం చేసిన సైనికుడు... పట్టుకున్న ఆర్మీ
X

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్న భారత సైనికుడిపై ఆర్మీ చర్యలకు దిగింది. సైన్యం కార్యాకలపాలకు సంబంధించిన విషయాలను దేశ రాజధానిలోని పాక్ ఎంబసీకి చేరవేస్తున్న జవానును కోర్టుకు అప్పగించింది. 'చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న అలీం ఖాన్ అనే సైనికుడు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీకి సమాచారాన్ని చేరవేస్తున్నారని గుర్తించాం. దీనిపై కోర్టులో విచారణ రెండు-మూడు రోజుల్లో మొదలవుతుంది' అని ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ ఎంబసీ నుంచి రూ.15 వేల నగదు కూడా తీసుకున్నట్లు తెలిపింది. ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితుల ఆందోళనకరంగా ఉన్న సమయంలో ఆర్మీ సమాచారాన్ని చేరవేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సైనికుడి విద్రోహ చర్యలను సహించమని, దోషులకు తగిన శిక్షలు విధించబడతాయని పేర్కొంది.

Advertisement

Next Story