Arvind Kejriwal: 'కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా?' ఈడీని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు

by S Gopi |
Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా? ఈడీని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా అని ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను(ఈడీ) ప్రశ్నించింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసి జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్.. 'నేను అయోమయంలో ఉన్నాను. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? మీరు అతన్ని మళ్లీ అరెస్టు చేయబోతున్నారా?' అంటూ అడిగారు. మద్యం పాలసీకి సంబంధించి కుంభకోణం ఆరోపణలతో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై వేసిన మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. జూలైలో ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సీబీఐ కేసులో ఇంకా జైలులోనే ఉన్నారు.

Advertisement

Next Story