Israel-Hamas War: కాల్పుల విరమణకు ఇదే చివరి అవకాశం..!

by Shamantha N |   ( Updated:2024-08-19 11:23:45.0  )
Israel-Hamas War: కాల్పుల విరమణకు ఇదే చివరి అవకాశం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై అమెరికా విదేశాంగశాఖ అధికారిక ప్రతినిధి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియా పర్యటనలో ఉన్న బ్లింకెన్‌.. టెల్ అవీవ్ లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చలను నిష్ఫలం చేయొద్దని ఇజ్రాయెల్‌, హమాస్‌ నేతలను కోరారు. "ఇది నిర్ణయాత్మక క్షణం.. బందీలను స్వదేశానికి తీసుకురావడానికి, కాల్పుల విరమణ పొందేందుకు, శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరినీ మెరుగైన మార్గంలో ఉంచడానికి బహుశా ఇదే ఉత్తమమైనది, చివరి అవకాశం కావచ్చు" అని బ్లింకెన్ అన్నారు. ఎటువంటి తీవ్రతరం కాకుండా, రెచ్చగొట్టే చర్యలు లేవని, ఏ విధంగానైనా ఈ ఒప్పందాన్ని అధిగమించకుండా ఉండాలని కోరారు. కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇదే అవకాశం కావొచ్చని పేర్కొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత పశ్చిమాసియాలో తొమ్మిదోసారి టెల్ అవీవ్ లో పర్యటించారు. ఆతర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed