- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్మూ కశ్మీర్‌లో మరో సంస్థపై నిషేధం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌కు చెందిన మరో సంస్థ తెహ్రీక్-ఏ-హురియత్‌ను ఉపా చట్టం కింద చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేసి ఇస్లామిక్ పాలనను తేవడమే లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ పాలసీ కింద, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తి, సంస్థను వెంటనే విచారిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే తెహ్రీక్-ఏ-హురియత్ పై చేసిన ఇన్వెస్టిగేషన్‌లో కశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు ఆ సంస్థ కృషి చేస్తున్నట్టు గుర్తించామని..ఈ క్రమంలోనే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. తెహ్రీక్-ఎ-హురియత్ అనేది సయ్యద్ అలీ షా గిలానీ స్థాపించిన వేర్పాటువాద రాజకీయ పార్టీ. కాగా, ఇటీవల కశ్మీర్‌కు చెందిన ముస్లిం లీగ్ (మసరత్ ఆలం గ్రూప్) గ్రూపుపై కూడా కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.