- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ కీలక నిర్ణయం.. పార్టీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి మార్పు విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేడీ నడ్డా పదవీకాలన్ని పొడిగించింది. ఈ ఏడాది జూన్ వరకు పొగిడించాలని పార్లమెంటరీ బోర్డు ఆదివారం ఆమోదం తెలిపింది. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమయంలో అధ్యక్షుడి మార్పు సరికాదని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, జేపీ నడ్డా 2019 జూన్ 19 నుండి 2020 జనవరి 20 వరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2020 జనవరి 20 నుండి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు.. దాంతో పాటు ఆరోగ్య, కేంద్ర కేబినెట్‌లో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.
ఇటీవల ఆయన పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన గత జనవరిలో అమిత్‌షా చేయగా, దీనికి బీజేపీ నేషనల్ కౌన్సిల్ అదివారం నాడు ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం నడ్డాకు ఉంటుంది. నడ్డా అధ్యక్షుడిగా బీజేపీ పలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో పార్టీని ఆయన విజయతీరాలకు చేర్చారు.