సనాతన ధర్మంపై మరో డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-07 10:40:28.0  )
సనాతన ధర్మంపై మరో డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిది అంటూ వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీఎంకే మంత్రులు, నేతలు ఉదయనిధికి సపోర్ట్ చేస్తున్నారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత ఏ. రాజా సనాతన ధర్మంపై ఇవాళ ఓ బహిరంగ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని చాలా తక్కువ స్థాయిలో విమర్శించారన్నారు. అంత కంటే భయంకరమైన వ్యాధులు అయిన ఎయిడ్స్, కుష్టు లాంటిది సనాతన ధర్మమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఎవరినైనా తీసుకురండి, నేను సనాతన ధర్మంపై చర్చకు సిద్దంగా ఉన్నాను.. మీరు మా తలలపై రూ.10 లక్షలు, రూ.కోటి అయినా అభ్యంతరం లేదన్నారు. అంతకంటే ఎక్కువ ఇస్తామన్నా వెనక్కి తగ్గేది లేదు’ అని రాజా సవాల్ చేశారు. ‘ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి, నన్ను అనుమతిస్తే, క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’ ఆ చర్చ తమిళనాడులో కాదని, ఢిల్లీలో పెడదామని, పెరియార్, అంబేద్కర్ పుస్తకాలతో వస్తానంటూ రాజా ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story