పంజాబ్‌లో మరోసారి కలకలం: చైనా డ్రోన్ స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

by samatah |
పంజాబ్‌లో మరోసారి కలకలం: చైనా డ్రోన్ స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ అంతర్జాతీయ సరిహద్దులో చైనా డ్రోన్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు డ్రోన్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు తాజాగా..పంజాబ్‌ అమృత్‌సర్‌లో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో హెరాయిన్‌ ప్యాకెట్‌తో కూడిన చైనా తయారీ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా సోదాలు నిర్వహించి డ్రోన్‌తో పాటు 520 గ్రాముల బరువున్న హెరాయిన్ ప్యాకెట్‌ను పట్టుకున్నారు. అమృత్‌సర్ జిల్లాలోని హర్డో రత్తన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సీజ్ చేసినట్టు బీఎస్ఎఫ్ పేర్కొంది.

‘సెర్చ్ ఆపరేషన్ టైంలో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు ఒక డ్రోన్‌, 520 గ్రాముల బరువు గల హెరాయిన్ ప్యాకెట్ పట్టుకున్నాయి. మాదక ద్రవ్యాలు ఒక టేప్‌తో చుట్టి ఉన్నాయి. ప్యాకెట్‌తో ఒక స్టీల్ రింగ్ కూడా జతచేసి ఉంది’ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రోన్‌ను చైనా తయారీ డీజేఐ మావిక్ 3 క్లాసిక్‌గా గుర్తించారు. టార్న్ తరన్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో మాదక ద్రవ్యాల సరుకుల ఉనికికి సంబంధించి బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం ఆధారంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. కాగా, గల నెలలోనూ పలు చైనా డ్రోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైను పాక్‌కు చెందిన డ్రోన్ కశ్మీర్ సరిహద్దుల్లోకి ప్రవేశించగా బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపి దానిని వెనక్కి పంపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed