ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. చార్జిషీట్‌లో మరో ఆప్ ఎంపీ పేరు

by Mahesh |   ( Updated:2023-05-02 08:15:05.0  )
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. చార్జిషీట్‌లో మరో ఆప్ ఎంపీ పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మధ్య కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. తాజాగా ఆప్ పార్టీకి చేందిన మరో ఎంపీ రాఘవ్ చద్దా పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో చేర్చింది. కాగా ఛార్జిషీట్ ప్రకారం విజయ్ నాయర్ మనీష్ సిసోడియా నివాసంలో పంజాబ్ ప్రభుత్వానికి చెందిన ఏసీఎస్ ఫైనాన్స్, ఎక్సైజ్ కమిషనర్, ఇతరులను ఎంపీ రాఘవ్ చద్దా కలిసినట్లు పేర్కొంది. కాగా ఈ కేసులో కొద్దిరోజులు క్రితం ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. తాజాగా ఆప్ ఎంపీ పేరును సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisement

Next Story