అంబానీయా మజాకా..! వెడ్డింగ్ కార్డు @ రూ. 6.50 లక్షలు.. అందులో ఏముందో తెలిస్తే షాక్..

by Indraja |
అంబానీయా మజాకా..! వెడ్డింగ్ కార్డు @ రూ. 6.50 లక్షలు.. అందులో ఏముందో తెలిస్తే షాక్..
X

దిశ వెబ్ డెస్క్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేష్ అంబాని గురించి పరిచయం అవసరం లేదు. ఆయన చిటికేస్తే బడాబడా నేతలే ఆయన చెంతకి చేరుతారు. ప్రముఖ సినీతారలే బ్యాక్‌సైడ్ డ్యాన్సర్లుగా మారుతారు, ఆయన ముందు ఆడిపాడి ఆయన్ను అలరిస్తారు అని చెప్పడానికి ఆయన చిన్న కొడుకు ప్రీ వెడ్డిగ్ ఈవెంట్ నిదర్సనం. ఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

కొడుకు సంతోషం కంటే ఎదీ ఎక్కువ కాదని భావించిన ముకేష్ అంబాని కొడుకు అనంత్ ప్రీవెడ్డింగ్‌కే వేళ కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది పెళ్లికి ఇంకెంత ఖర్చు చేస్తారో ఊహించలేం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంబాని ఇంట్లో పెళ్లి సందడి మెదలైనట్టు తెలేస్తోంది. గారాల కోడుకు అనంత్ పెళ్లి పనులు చకచకా జరుగుతున్నట్టు సమాచారం. ఇక అనంత్ అంబాని పెళ్లి పత్రికల డిజన్ సైతం పూర్తైనట్టు సమాచారం. మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో వెడ్డింగ్ కార్డులను తయారు చేయించారు. కాగా ఈ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర రూ. 6.50 లక్షలు అని సమాచారం.

Next Story