- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌లో వైద్య విద్య కొరత ఇంత ఘెరంగా ఉందా: ఆనంద్ మహీంద్రా
దిశ, డైనమిక్ బ్యూరో: వైద్య విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఇతర దేశాల్లోని యూనివర్సిటీలకు దారికడుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ దేశంలో భారత్ నుంచి 18వేల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకుంటున్నారు. యుద్ధం కారణంగా అక్కడున్న విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంతో.. అసలు ఇండియా నుంచి ఇతర దేశాల్లో వైద్య విద్య కోసం వెళ్లిన వారి ప్రస్తావన వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నివేదించిన లెక్కల ప్రకారం.. చైనాలో 23000, ఉక్రెయిన్‌లో 18000, రష్యాలో 16500, పిలిపిన్స్‌లో 15000, జార్జియాలో 7500, బంగ్లాదేశ్‌లో 5200, పోలాండ్‌లో 4000, అర్మేనియాలో 3000 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపింది. అయితే, దీనిపై స్పందించిన పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా.. భారత్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు కొరత ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి కొరత ఉందని ఇప్పటి వరకు తెలియదని చెప్పుకొచ్చారు. టెక్ మహీంద్రా యూనివర్సిటీలో మెడికల్ స్టడీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్వేషించాలంటూ టెక్ మహింద్రా సీఈవో సీపీ గుర్నానిని ఆదేశించారు. ఈ సందర్భంగా.. సాధ్యాసాధ్యాలను తెలుసుకొని వైద్య విద్యపై నిర్ణయం తీసుకోనున్నారు.