మణిపూర్‌ అల్లర్లపై బాక్సర్ మేరీకోమ్ ఆవేదన

by sudharani |
మణిపూర్‌ అల్లర్లపై బాక్సర్ మేరీకోమ్ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైటిస్ వర్గానికి షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వడంపై మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంతేకాదు ఈ ఆందోళనల్లో ఇప్పటికే అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో మొత్తం 8 మంది మృతి చెందారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పిలో పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 7,500 పైగా మందిని సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలకు తరలించారు.

అయితే ఈ ఘటనపై బాక్సర్, మాజీ రాజ్యసభ ఎంపీ MC మేరీ కోమ్ స్పందించారు. మణిపూర్‌లో పరిస్థితి బాగాలేదని ఆమె తెలిపారు. అటు అస్సాంలోనూ పరిస్థితి మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేవారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ హింసలో కొందరు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దాలని మేరీ కోమ్ కోరారు.

Advertisement

Next Story