Amith shah: భారత్‌ను తయారీ హబ్‌గా మార్చడమే లక్ష్యం.. కేంద్ర మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amith shah: భారత్‌ను తయారీ హబ్‌గా మార్చడమే లక్ష్యం.. కేంద్ర మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశాన్ని తయారీ హబ్‌గా మార్చడమే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్- (Global investers summit) 2025 ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనేక సంస్థలు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రూ.30,77,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయని నొక్కి చెప్పారు. 2027 నాటికి దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేడమే ప్రభుత్వం ద్యేయమని, ఈ ప్రయాణంలో మధ్యప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు.

‘గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో 200 వందలకు పైగా భారతీయ కంపెనీలు, ప్రపంచ సీఈఓలు, ఇరవైకి పైగా యునికార్న్ వ్యవస్థాపకులు, యాభైకి పైగా దేశాల ప్రతినిధులు మధ్యప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఇది రాష్ట్రానికి ఒక పెద్ద విజయం. ఈసారి మధ్యప్రదేశ్ కూడా కొత్త ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాలకు దిశను చూపుతుంది’ అని తెలిపారు. రెండు రోజుల పెట్టుబడిదారుల సమ్మిట్ ముగింపులో మధ్యప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో రూ.30.77 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు వచ్చాయని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Next Story