Amith shah: 2029లోనూ ఎన్డీఏదే విజయం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amith shah: 2029లోనూ ఎన్డీఏదే విజయం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: 2029 లోక్ సభ ఎన్నికల్లోనూ ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పదవీ కాలాన్ని సైతం విజయవతంగా పూర్తి చేస్తామని తెలిపారు. చండీగఢ్‌లోని మణిమజ్రాలో ఓ నీటి సరఫరా చేసే ప్రాజెక్టును అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రతిపక్షాలు ఏం చెప్పినా బీజేపీ నేతలు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే 2029లోనే ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది. మళ్లీ మోడీనే ప్రధాని అవుతారు. ఈ విషయంపై నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా’ అని చెప్పారు.

కొంత విజయంతో తాము ఎన్నికల్లో గెలిచామని ప్రతిపక్షాలు భావిస్తున్నారని, కానీ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దానికంటే ఎక్కువ సీట్లు సాధించిందని వారికి తెలియదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని చెబుతున్న వారు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలని, అంతేగాక ప్రతిపక్ష హోదాలో సమర్థవంతంగా పనిచేయడం కూడా నేర్చుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed