Amith Shah : అమిత్ షా వ్యాఖ్యలపై కమల్‌హాసన్, విజయ్ సీరియస్

by Sathputhe Rajesh |
Amith Shah : అమిత్ షా వ్యాఖ్యలపై కమల్‌హాసన్, విజయ్ సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో : అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్, తమిళగ వెట్రీ కజగం పార్టీ చీఫ్, తమిళ స్టార్ హీరో విజయ్‌లు ఖండించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా గురువారం కమల్ హాసన్ స్పందించారు. ‘గాంధీజీ విదేశీయుల అణచివేత నుంచి భారతదేశానికి విముక్తి కల్పించారు. అంబేడ్కర్ దేశంలోని సామాజిక అన్యాయాల నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ దృక్పథాన్ని భారతీయులంతా నమ్ముతున్నారు. దాని కోసం పోరాటం చేస్తున్నారు. అందరూ సమానంగా పుట్టిన గడ్డపై ఆ మహానీయుని వారసత్వం మసకబారడాన్ని ఎప్పటికీ సహించబోమన్నారు. రాజ్యాంగాన్ని ఆమోందించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్లమెంట్‌లో ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. అప్పుడే ఇవి మన ప్రగతికి స్ఫూర్తినిస్తాయన్నారు.

అంబేడ్కర్ పేరంటే వాళ్లకు అలర్జీ : విజయ్

అంబేడ్కర్ పేరంటే కొంత మందికి అలర్జీ అని తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ఆయన ‘ఎక్స్’ వేదికగా ఖండించారు. అంబేడ్కర్ రాజకీయ, మేధో వ్యక్తిత్వం భారత పౌరుల స్వేచ్ఛ, స్ఫూర్తికి నిదర్శమన్నారు.అంబేడ్కర్ అని నినదిస్తే మన మనసు, పెదవులు ఆనందంతో పులకరిస్తాయన్నారు. ఆయన వారసత్వం అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా అంబేడ్కర్ చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు.

Advertisement

Next Story