Amith shah: ఉగ్రవాద నిర్మూలనకు పక్కా వ్యూహం.. యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్‌లో అమిత్ షా

by vinod kumar |
Amith shah: ఉగ్రవాద నిర్మూలనకు పక్కా వ్యూహం.. యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్‌లో అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు నరేంద్ర మోడీ(Pm modi) ప్రభుత్వం కట్టుబడి ఉందని, టెర్రరిజానికి వ్యతిరేకంగా పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith shah) అన్నారు. ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహించే ‘యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2024’ సందర్భంగా ఆయన ప్రసంగించారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పటికీ ఉగ్రవాదానికి ప్రాదేశిక సరిహద్దులు లేవని, కాబట్టి భద్రతా సంస్థలు కేంద్ర,రాష్ట్రాల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఉమ్మడి వ్యూహాలను రూపొందించాలని సూచించారు. గూఢచర్యం విషయాలను పరస్పరం షేర్ చేసుకోవాలని తెలిపారు. సాంకేతికత(Technology)ని సైతం ఉపయోగించుకోవాలని నొక్కి చెప్పారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోడీ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచం మొత్తం ఆమోదించిందని కొనియాడారు. గత దశాబ్దంతో పోల్చితే ఉగ్రవాద ఘటనలు 70 శాతం తగ్గాయని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రయత్నాల వల్ల జమ్మూ కాశ్మీర్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో హింస చాలా తగ్గిందన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అన్ని ఉగ్రవాద కేసుల్లో ఉపా చట్టాన్ని ఉపయోగిస్తోందని, ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన 632 కేసుల్లో 498 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశామని, దాదాపు 95 కేసుల్లో పలువురు దోషులుగా తేలారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed