Amit Shah: తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టలేరు.. అమిత్ షా సెన్సేషనల్ ట్వీట్

by Shiva |   ( Updated:2025-02-08 13:11:45.0  )
Amit Shah: తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టలేరు.. అమిత్ షా సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ (BJP) బంపర్ విక్టరీ కొట్టింది. 26 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఢిల్లీ (Delhi)లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (BJP), 23 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పని చేసింది. ఎన్నడూ లేనివిధంగా బీజేపీ (BJP)కి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభించడం బీజేపీ గెలుపు సుభమైంది.

ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ’X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ఢిల్లీ (Delhi) ప్రజలు చెప్పారు. వారి ఓట్లతో, ప్రజలు మురికి యమునా, మురికి తాగునీరు, విరిగిన రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు, ప్రతి వీధిలో తెరిచిన మద్యం దుకాణాలపై స్పందించారు. ఢిల్లీలో ఈ మహా విజయం కోసం అహోరాత్రులు శ్రమించిన వారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ (Virendra Sachdeva)లకు నా హృదయపూర్వక అభినందనలు. ‘మహిళల పట్ల గౌరవం, అనధికార కాలనీ నివాసితుల ఆత్మగౌరవం, స్వయం ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్న ఢిల్లీలో.. ఇక ప్రధాన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీ ఆదర్శవంతమైన రాజధానిగా మారనుంది’ అంటూ ట్వీట్ చేశారు.

Next Story