లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన అమిత్ షా.. పోటీ ఎక్కడ్నుంచంటే?

by Shamantha N |
లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన అమిత్ షా.. పోటీ ఎక్కడ్నుంచంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు అమిత్ షా. నామినేషన్ దాఖలు చేసుందుకు అమిత్ షాతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ కూడా హాజరయ్యారు. బీజేపీ కంచుకోట.. గాంధీనగర్ నుంచి గతంలో ఎల్కే అద్వానీ ప్రాతినిధ్యం వహించారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్, లక్నో నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బరిలో దిగారు. కానీ, ఆయన లక్నోలోనే గెలిచారు.

గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనాల్ పటేల్ బరిలో ఉన్నారు. 2019లో అమిత్ షా గాంధీనగర్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఏకంగా 69.67 శాతం ఓట్లను సాధించి.. తన పవర్ నిరూపించుకున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా..గాంధీ నగర్ స్థానానికి మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed