మోడీ మూడోసారి పీఎం అవడం పక్కా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by Javid Pasha |
Home Minister Amit Shah
X

దిశ, వెబ్ డెస్క్: నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడారు. మోడీ పీఎం అయ్యాక ఆర్థికంగా 9వ స్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. మోడీ మూడోసారి పీఎం అవ్వడం ఖాయమని, 2027 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని అన్నారు.

దేశంలో 60 కోట్ల మందికి వెలుగులు నింపిన వ్యక్తి మోడీ అని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్రంపై ప్జలకు విశ్వాసం ఉందని.. అందుకే దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో తమను గెలిపించారని అన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీలో లేదని.. విపక్షాల అవిశ్వాస తీర్మానం వల్ల తమకు కలిగే నష్టం ఏం లేదని చెప్పారు.

Next Story

Most Viewed