- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah : ఉద్ధవ్ థాక్రే ‘ఔరంగజేబ్ అభిమానుల సంఘం నాయకుడు’ : అమిత్‌షా
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రకు చెందిన సీనియర్ విపక్ష నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. ఎన్‌సీపీ -ఎస్‌పీ అధినేత శరద్‌పవార్‌ను ‘అవినీతిపరుల అధినేత’గా ఆయన అభివర్ణించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేను ‘ఔరంగజేబ్ అభిమానుల సంఘం నాయకుడి’గా అమిత్‌షా విమర్శించారు. ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో జరిగిన మహారాష్ట్ర బీజేపీ ఆఫీస్ బేరర్ల గ్రాండ్ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేలకు సరైన విజన్ లేదన్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఓడిపోయిన తర్వాత విపక్ష నేత రాహుల్ గాంధీ అహంకారం తగ్గుతుందని షా వ్యాఖ్యానించారు. “గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లన్నీ కలుపుకున్నా.. వాళ్ల ఎంపీ సీట్ల సంఖ్య 240 దాటదు.
ఈ ఎన్నికల్లోనూ భారతదేశ ప్రజలు మోడీకే తమ ఆమోద ముద్ర వేశారు. అందుకే బీజేపీ వరుసగా మూడోసారి ఘన విజయం సాధించింది’’ అని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ‘‘ప్రధాని మోడీ సర్కారు వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్ నోరును మూయించింది. మరో రెండేళ్లలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను’’ అని ఆయన అన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్-అజిత్ పవార్ సారథ్యంలోని ‘మహాయుతి’ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అమిత్‌షా చెప్పారు. ప్రజాసంక్షేమం లక్ష్యంగా రాష్ట్రంలో తమ సర్కారు ఎన్నో పథకాలను ప్రారంభించిందన్నారు.