Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కుమారి సెల్జా, అశోక్ తన్వర్ లాంటి దళిత నేతలను అవమానించిందని విమర్శించారు. హర్యానాలోని తోహానాలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నిరంతరం దళిత నాయకులను అవమానిస్తూనే ఉందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘అభివృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్ అవసరం లేదని రాహుల్ చెబుతున్నారు. మరి హర్యానా ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఇక్కడ రిజర్వేషన్ల అమలును కాంగ్రెస్ ఆపివేస్తుండా’ అని ప్రశ్నించారు. రిజర్వేషన్లను రక్షించే సామర్థ్యం కేవలం ప్రధాని మోడీకి మాత్రమే ఉందని నొక్కి చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో లంచం తీసుకోకుండా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి యువతకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాగా, దళిత నాయకురాలు సెల్జా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఇటీవల, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సెల్జా ప్రచారానికి దూరంగా ఉన్నారనే వార్తల మధ్య బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. అంతేగాక తన ఎన్నికల ప్రచారాల్లో సైతం బీజేపీ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story

Most Viewed