- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Animal Fat: రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోన్న తిరుమల లడ్డూ వివాదం.. వెలుగులోకి జంతువుల కొవ్వు వాడిన ఆహార పదార్థాలు
దిశ, వెబ్‌డెస్క్: కామన్‌గా ఆహారపదార్థాల్లో పందికొవ్వును ఎక్కువగా వినియోగిస్తారని వార్తలు వింటుంటాం. ప్రస్తుత రోజుల్లో జంతువుల కొవ్వులతో రెడీ చేసే ఆహార పదార్థాలు మరీ ఎక్కువవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి కూడా. ముఖ్యంగా తిరుపతి లడ్డు వివాదం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే పవిత్రమైన లడ్డూలో కూడా జంతువుల కొవ్వును వాడారని అంటున్నారు. ఈ ఇష్యూ ప్రజెంట్ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరీ ఏ ఏ పదార్థాల్లో జంతువుల కొవ్వులను ఉపయోగిస్తారనేది తాజాగా నిపుణులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్లారిటీ ఇచ్చారు. ఏ ఏ పదార్థాల్లో జంతువుల కొవ్వును వాడుతారో నిపుణులు చెప్పింది ఇప్పుడు చూద్దాం..
జంతువుల కొవ్వును ఉపయోగించే పదార్థాలు..
బిస్కెట్స్: చిన్నపిల్లలకు ఎక్కువగా తినే బిస్కెట్లలో కొవ్వును కలుపుతారట. అంతేకాకుండా కొన్ని రకాల బిస్కెట్స్ తో పాటు కుకీలలో జంతువుల కొవ్వును వాడి తయారు చేస్తారట. వెన్న రుచిని కలిగి ఉండే బిస్కెట్స్, కుకీలు తినే వారు జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
వనస్పతి: జంతువుల కొవ్వు ను కలిపి వనస్పతిని తయారు చేస్తారట. పలు రకాల వనస్పతిలోనే జంతువుల కొవ్వును వినియోగిస్తారట.
సాసేజ్‌లు: బార్‌లు, సాసేజ్, మీట్‌బాల్‌లు వంటి పదార్థాల్లో జంతువుల కొవ్వును వాడి తయారు చేస్తారట.
సూప్‌లు: కొన్ని రకాల సూప్‌ల్లో జంతువుల కొవ్వును వాడుతారట. అలాగే స్టాక్‌లలో జంతువుల కొవ్వును అధికంగా ఉపయోగిస్తారని టాక్.
ఫాస్ట్ ఫుడ్ : ఫాస్ట్ ఫుడ్ లో కూడా జంతువుల కొవ్వును వాడుతారు. అనగా.. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్స్ లో వినియోగిస్తారు.
చాక్లెట్: చిన్న నుంచి పెద్దలు ఇష్టపడే చాక్లెట్స్ లో కూడా జంతువుల కొవ్వు కలుపుతారట. అన్ని ఆహార పదార్థాల కంటే చాక్లెట్స్‌లోనే ఎక్కువగా జంతువుల కొవ్వును వినియోగిస్తారట.
చీజ్: జున్ను అండ్ ప్రాసెస్ చేసిన చీజ్‌లలో జంతువుల కొవ్వును వాడుతుంటారట.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.