Google CEO: భారత్‌లో ఏఐ అవకాశాలపై గూగుల్ అన్వేషణ: సీఈఓ సుందర్ పిచాయ్

by S Gopi |
Google CEO: భారత్‌లో ఏఐ అవకాశాలపై గూగుల్ అన్వేషణ: సీఈఓ సుందర్ పిచాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ విజన్ పరంగా భారత్‌ను మార్చడంపై దృష్టి సారించారని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ద్వారా ప్రయోజనాలను పొందే మార్గాలను అన్వేషిస్తున్నారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ టెక్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన రౌడ్‌టేబుల్ ఇంటరాక్షన్‌లో ప్రధాని మోడీతో సుందర్ పిచాయ్ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్‌లోనే మేకింగ్, డిజైన్‌ను కొనసాగించేందుకు నరేంద్ర మోడీ మాతో చర్చించారు. దాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ ఫోన్‌లను భారత్‌లోనే తయారు చేస్తుండటం గర్వంగా ఉందని సమావేశం అనంతరం సుందర్ పిచాయ్ అన్నారు. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ సహా వివిధ రంగాల్లో ఏఐ అప్లికేషన్ అవకాశాలను అన్వేషించేలా, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ నుంచి ప్రయోజనాలను అన్వేషించాలని మోడీ సూచించినట్టు పేర్కొన్నారు. అందుకోసం గూగుల్ ఇప్పటికే ఏఐలో భారీ పెట్టుబడులు పెడుతోంది. భారత్‌లో ఏఐ కోసం పలు కంపెనీలతో భాగస్వామ్యం కొనసాగిస్తోందన్నారు.

Advertisement

Next Story